ఆర్మీలో చేరి దేశానికి సేవ చేశాడు.. చివరకు భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. కర్ణాటకలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకాయి.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ప్రతీ ఇంటిపై జెండా.. ప్రతీ గల్లీలో జెండా.. ప్రతీ ఊరిలో జెండా, ప్రతీ వీధిలో జెండా అనే తరహాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేసే కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాను కుప్పకూలి.. అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని రిటైర్డ్ సైనికుడు గంగాధరగౌడ్‌గా గుర్తించారు.
Read Also: Woman beats society guard: శునకాలపట్ల క్రూర ప్రవర్తన.. సెక్యూరిటీ గార్డ్‌కు బడితే పూజ..!
దేశవ్యాప్తంగా ప్రజలు 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో, కడప తాలూకాలోని కుట్రుపడి గ్రామ పంచాయతీలో కూడా జెండా ఎగురవేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేడుకల్లో పాల్గొన్న గంగాధర గౌడ.. జాతీయ జెండాకు వందనం చేయాలని పిలుపునిచ్చిన వెంటనే కుప్పకూలిపోయారు.. వెంటనే ఆస్పత్రికి తరలించినే ఉపయోగం లేకుండా పోయింది.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మొత్తంగా జవాన్‌గా దేశానికి సేవ చేసిన వ్యక్తి.. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రాణాలు వదలిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.