Site icon NTV Telugu

Brutally Attacked: దారుణం.. డీఎస్పీ పై కత్తితో దాడి.. 350 కిలోమీటర్లు ప్రయాణించి మరీ..

Untitled Design (7)

Untitled Design (7)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) తోమేష్ వర్మపై దారుణమైన కత్తి దాడి జరిగింది. ఈ దాడి అత్యంత ప్రణాళికబద్ధంగా జరిగినది. దుర్గ్ జిల్లా నుంచి దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించిన దుండగులు డీఎస్పీని ట్రాక్ చేసి, అతని కారులోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు.

డీఎస్పీ వర్మ ఆ సమయంలో అధికారిక పనితీరు కోసం దంతేవాడ సెషన్స్ కోర్టుకు వెళ్ళారని పోలీసులు వెల్లడించారు. దుర్గ్ జిల్లాకు చెందిన రామశంకర్ సాహు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రజనీషా వర్మ తదితరులు డీఎస్పీ కదలికలను గమనించి, కొద్దిసేపటి తర్వాత, ఒక మహిళ కత్తి తీసుకుని డీఎస్పీని బెదిరించి అతని కారులోకి ఎక్కించిందని పోలీసులు తెలిపారు. దాడి చేయడానికి దుర్గ్ నుండి దంతేవాడ వరకు దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు.

దాడిలో డీఎస్పీ వర్మకు మెడ, ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు, ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి విచారణను కొనసాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Exit mobile version