Site icon NTV Telugu

Ranchi: బార్‌లో మ్యూజిక్ వివాదం.. డీజేను గన్తో కాల్చి చంపిన వ్యక్తి

Ranchi

Ranchi

జార్ఖండ్ రాజధాని రాంచీలో డీజేను ఓ వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం (మే 27) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఒక బార్‌లో వివాదం కారణంగా డీజే హత్యకు గురయ్యాడు. హత్యకు సబంధించిన ఘటన అక్కడి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్‌లో 4-5 వ్యక్తులు, డీజే సందీప్ మరియు బార్ సిబ్బందితో మ్యూజిక్ ప్లే చేయడం గురించి గొడవ జరిగింది. మొదట్లో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం బార్ మూసివేసిన తర్వాత వచ్చి ఒకరు డీజే సందీప్‌ను కాల్చి చంపారు. ఈ ఘటన తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జరిగింది.

Read Also: Tamil Nadu: సెప్టిక్ ట్యాంక్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం..

హత్య దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలో వీడియో రికార్డైంది. అందులో అర్ధనగ్నంగా ఉన్న ఓ వ్యక్తి రైఫిల్‌ను పట్టుకుని పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో సందీప్ ఛాతీపై కాల్పులు జరుపుతున్నట్లు ఉంది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై ఇతర ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సందీప్ ను ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా.. నిందితుడిని అభిషేక్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. అతని వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బార్ సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

Read Also: Cyclone Remal: రెమల్ తుఫాను బీభత్సం.. బెంగాల్‌లో ఇద్దరు మృతి

Exit mobile version