Man kills Mother: రూ. 5000 ఇవ్వలేదని అమ్మను చంపాడు.. సూట్‌కేస్‌లో డెడ్‌బాడీతో వేరే రాష్ట్రానికి..

Crime

Crime

Man kills Mother: డబ్బుల కోసం ఓ కన్న కొడుకు కర్కోటకుడిగా మారాడు. తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది. రూ. 5000 ఇచ్చేందుకు నిరాకరించినందుకు 21 ఏళ్ల వ్యక్తి తల్లితో వాగ్వాదానికి దిగారు. చివరకు తల్లి గొంతు కోసి హత్య చేశాడు.

డిసెంబర్ 13న బీహార్‌కి చెందిన హిమాన్షు తన తల్లి కలిసి హిస్సార్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అతను, తన తల్లిని రూ. 5000 అడిగాడు, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో తల్లి గొంతుకోసి చంపాడని పోలీసులు తెలిపారు. అదే రోజు సాయంత్రం తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టుకుని రైలులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాడు.

×
×
Ad

Read Also: Vijay Diwas: భారత్ ముందు తలవంచిన 90 వేల మంది పాక్ సైనికులు.. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కీలక సంఘటనలు..

అయితే, ఆ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న హిమాన్షును పోలీసులు పట్టుబడ్డాడు. సూట్‌కేస్‌ని సోదా చేయగా అందులో డెడ్ బాడీ కనిపించింది. హర్యానా పోలీసులు సంప్రదించగా.. హిమాన్షు, అతని తల్లితో అద్దెకు నివసిస్తున్నట్లు తేలింది. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను స్కాన్ చేయడంతో హిమాన్షు ఆటోలో ఏదో ఉంచుతున్నట్లు కనిపించింది. ఈ హత్యపై తదుపరి విచారణ సాగుతోంది.