NTV Telugu Site icon

Chennai: చెన్నైలో బీకామ్ విద్యార్థి ఆత్మహత్య.. ఓ మహిళ ఏం చేసిందంటే..!

Chennai

Chennai

కొంత మంది విద్యార్థులు చదువుతో పాటు పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద నిలబడుతుంటారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని చాలా మంది పిల్లలు ఖాళీ సమయాల్లో ఏదొక పని చేసుకుంటూ చదువుకుంటారు. కానీ అదే ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి ఉద్దేశంతో కష్టపడుతుంటే.. ఒక మహిళ మాటలు కారణంగా అర్ధాంతరంగా ప్రాణాలే పోయాయి. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

జె.పవిత్రన్‌ (19) అనే యువకుడు చెన్నైలోని కొలత్తూరు ప్రాంతంలో ఉంటాడు. బీకాం చదువుతున్నాడు. చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం కిరాణా సరుకులు డెలివరీ చేస్తుంటాడు. అయితే ఒక మహిళ అడ్రస్ తెలియక.. లేటుగా వస్తువులు డెలివరీ చేశాడు. అతగాడి ఇబ్బందులేమీ పట్టించుకోకుండా మహిళ చెడామడా.. నోటికొచ్చినట్లు తిట్లు పురాణం అందుకుంది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: చంద్రబాబు వచ్చారు.. జనాన్ని వరదల్లో ముంచారు

 

సూసైడ్ నోట్‌..
సూసైడ్ నోట్‌లో తన మరణానికి కారణం డెలివరీ సమయంలో బూతులు తిట్టిన మహిళనే కారణమని చెప్పాడు. ఆమె తిట్టడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపాడు. అలాంటి మహిళలు ఉన్నంత వరకు మరిన్ని మరణాలు సంభవిస్తాయి అంటూ పవిత్రన్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రన్‌కు మహిళ ఇల్లు దొరకకపోవడంతో డెలివరీ ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. లేటుగా కిరాణా సరుకులు డెలివరీ చేశాడని కస్టమర్ అయిన మహిళ యువకుడితో గొడవ పెట్టుకుందని పోలీసులు చెప్పారు. కస్టమర్.. కంపెనీకి ఫోన్ చేసి డెలివరీ బాయ్‌పై కంప్లెంట్ చేసింది. పవిత్రన్‌ను మళ్లి పంపించొద్దని కోరింది. రెండో రోజుల తర్వాత యువకుడు మహిళ ఇంటిపై రాయి విసరడంతో కిటికీ అద్దం పగిలిందని.. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో యువకుడిని మందలించి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో పవిత్రన్ ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడించారు. కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పవిత్రన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!

Show comments