రెస్టారెంట్‌లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఆర్డర్ త్వరగా తీసుకురామని అడిగిన పాపానికి కస్టమర్ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata Doctor case: కోల్‌కతా కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై ఐఎంఏ సస్పెన్షన్ వేటు..
ఢిల్లీలోని కేతన్స్ ఫుడ్ కోర్ట్ అనే రెస్టారెంట్ దగ్గర తెల్లవారుజామున 3:30 గంటలకు హర్నీత్ సింగ్ సచ్‌దేవా అనే కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు. అది వచ్చేందుకు ఆలస్యం కావడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెస్టారెంట్ యజమాని దాడి చేయడంతో హర్నీత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ సమయం వరకు రెస్టారెంట్ నిర్వహించడంపై పోలీసులు ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha : హైదరాబాద్‌కు చేరుకున్న కవిత
పోలీసులు తెలిపిన ప్రకారం.. మృతుడు రెస్టారెంట్‌కు వెళ్లాక.. అతడిచ్చిన ఆర్డర్ ఆలస్యం కావడంతో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని చెప్పారు. యజమానులు కేతన్ నరులా, అజయ్ నరులా కొంతమంది వ్యక్తులతో అక్కడికి వచ్చారని.. అనంతరం మృతుడు, అతని స్నేహితులు.. యజమానుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన వ్యక్తిని అతని స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. అక్కడికి వెళ్లాక అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఆ సమయంలో రెస్టారెంట్ ఎందుకు నడుస్తుందనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
