NTV Telugu Site icon

Porn Addiction: పోర్న్‌కి బానిసయ్యాడు.. భార్యని కూడా అలాగే డ్రెస్సులు వేసుకోమని..

Porn Addiction

Porn Addiction

Porn Addiction: ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్న్ సైట్లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు క్రమంగా ఈ పోర్న్ కి బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇలాగే పోర్న్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Extramarital Affair: భర్తని వదిలి మరొకరితో పెళ్లి.. షాకిచ్చిన రెండో భర్త.. చివరికి?

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల భార్యను పోర్న్ చూడాలని, పోర్న్‌స్టార్‌ల దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పోర్న్ కు బానిసయ్యాడని సదరు మహిళ ఆరోపించింది. ఈ జంటకు 2020లో పెళ్లి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. తన భర్త, భర్త కుటుంబం కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు, తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు మహిళన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ల 498 A (భర్త లేదా భర్త బంధువు ఆమెను క్రూరత్వానికి గురి చేయడం), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 377 (అసహజ నేరం), 34 కింద కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (షహదర) రోహిత్ మీనా తెలిపారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక విచారణలో ఉందని వెల్లడించారు. ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నామని.. సాక్ష్యుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.