NTV Telugu Site icon

Delhi: భార్య వేధింపులకు మరొకరు బలి.. తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య

Delhifire

Delhifire

దేశంలో భార్య వేధింపులకు భర్తలు బలైపోతున్నారు. వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ మధ్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య.. అనంతరం ఢిల్లీలో కేఫ్ యజమాని పునీత్ ఖురానా సూసైడ్.. తాజాగా హస్తినలోనే న్యాయవాది ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో భార్య వేధింపులు తాళలేక న్యాయవాది సమీర్ మెహెందిర్తా (45) తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు ముందు భార్యతో విడాకులకు సంబంధించిన ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ వ్యక్తి.. హిందువుగా, ఆర్మీ అధికారిగా నమ్మిస్తూ మహిళల మోసం..

45 ఏళ్ల సమీర్ మెహెందిర్తా అనే న్యాయవాది ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో న్యాయవాద వృత్తిని చేస్తున్నారు. భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. అయితే భార్యతో విడాకులకు సంబంధించిన గొడవ జరిగింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించాడు. భార్యతో చాటింగ్ చేస్తుండగా బుధవారం మధ్యాహ్నం సమీర్ తుపాకీ తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. 40 పేజీల సూసైడ్ లేఖతో పాటు వీడియో రికార్డ్ చేసి చనిపోయాడు. ఇది మరువక ముందే ఢిల్లీలో కేఫ్ యజమాని పునీత్ ఖురానా కూడా సతీమణి పెడుతున్న వేధింపులు తాళలేక ఊపిరి తీసుకున్నాడు. ఉరివేసుకుని చనిపోయాడు. తాజాగా అదే తరహాలో వేధింపులు జరగడంతో న్యాయవాది చనిపోయాడు. వరుస ఘటనలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ

Show comments