Site icon NTV Telugu

Delhi Murder: ఢిల్లీలో ఘోరం.. కత్తెరతో భార్య, అత్తను చంపేశాడు

Delhi Murder

Delhi Murder

Delhi Murder: దేశ రాజధానిలో ఘోరం వెలుగుచూసింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో ఓ వ్యక్తి తన అత్తను, భార్యను కత్తెరతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టినరోజున వచ్చిన బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నిందితుడు తన భార్య, అత్తగారిని కత్తెరతో హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

READ ALSO: Balakrishna : బాలయ్య మంచి మనసు.. వరద బాధితులకు రూ.50 లక్షలు

ఈసందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రోహిణిలోని సెక్టార్ 17లో యోగేష్ సెహగల్ అనే వ్యక్తి తన భార్య ప్రియ(27), అత్త కుసుమ్ సిన్హా (63), కుతూరుతో కలిసి ఉంటున్నారు. ఈక్రమంలో కుమార్తె పుట్టిన రోజున వచ్చిన బహుమతుల విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. అలాగే వారి మధ్య గృహ వివాదం కూడా చోటుచేసుకుంది. దీంతో నిందితుడు యోగేష్ తన భార్య, అత్తగారిపై కత్తెరతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోయాడు. వెంటనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారించిన తర్వాతే హత్య వెనుక అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

READ ALSO: Health Tips: గంటల తరబడి టాయిలెట్‌లో ఉంటున్నారా.. డేంజర్ బెల్స్ మోగుతాయి జాగ్రత్త

Exit mobile version