NTV Telugu Site icon

Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే

Crime

Crime

Crime News: రోజురోజుకు సమాజంలో మనిషి మైండ్ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. ఎప్పుడు ఎవరు..ఎలా చంపేస్తారో అని భయం మొదలయ్యింది. వివాహేతర సంబంధాల వలన భార్యాభర్తలు.. డబ్బు కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. పెళ్లి చేసుకోమందని ప్రియురాలిని నరికి ముక్కలు ముక్కలు చేశాడు ఒకడు.. కూర సరిగ్గా వండలేదని భార్యను, ప్రేమించిన అమ్మాయి తో చనువుగా ఉన్నాడని స్నేహితుడిని ముక్కలు చేసాడు ఇంకొకడు.ఇలా మనిషి ప్రాణానికి విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. తాజాగా కన్నతల్లిని చంపి ముక్కలు ముక్కలు చేసి రెండు నెలలుగా ఇంట్లోనే ఉంచుకుంది ఒక కూతురు. ఈ దారుణ ఘటన ముంబైలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని లాల్‌బాగ్ చాల్‌ లో వీణా ప్రకాష్‌ జైన్‌ ఆమె కుమార్తె రింపుల్ నివసిస్తున్నారు.ఇక డిసెంబర్ 27 న వీణా మెట్లపై నుంచి జారీ కిందపడిపోయింది. దీంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలాయి.రింపుల్, తల్లిని హాస్పిటల్ కూడా తీసుకువెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసింది. దీంతో ఆమె తల్లి రెండు రోజుల్లోనే మృతిచెందింది. ఇక తల్లి మరణంతో రింపుల్ మెంటల్ స్టేటస్ మారిపోయింది. ఎక్కడ తన తల్లిని చంపింది తానే అని అందరు తనను జైలుకు పంపిస్తారేమో అని భయపడింది. వెంటనే బయటికి వెళ్లి మార్బుల్ కట్టర్ కొని.. తల్లి మృతదేహాన్ని ఐదు ముక్కలుగా కోసింది. ఆ కట్టర్ పనిచేయకపోవడంతో కత్తితో శరీర భాగాలను కట్ చేసి బ్యాగ్ లో చుట్టి ఇంట్లోనే దాచేసింది. ఇక శరీరం స్మెల్ రాకుండా తీ ఆకులు, రూమ్ ఫ్రెషనర్ బాటిల్స్ 40 కొని ఇల్లంతా ఆస్మెల్ వచ్చేలా చేసింది. అలా రెండు నెలలు తల్లి శరీర భాగాలతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. అనంతరం ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో గుట్టు బయటపడింది. తల్లి మరణం తనమీదకు వస్తుందనే భయంతోనే తాను ఇలా చేసినట్లు రింపుల్ అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిన పోలీసులు మరింత విచారణ చేపట్టారు.