Site icon NTV Telugu

AP Crime News: “దొంగ – పోలీస్” ఆట అంటూ హత్య.. తాళ్లతో కట్టి.. పెట్రోల్‌ పోసి..!

Ap Crime News

Ap Crime News

AP Crime News: విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్ వెలుగు చూసింది… అత్త కనకమహాలక్ష్మిని కోడలు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు… దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించి కోడలు… ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం కోడలు చేసింది… పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది..

Read Also: Chikiri Chikiri: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే!

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తీసుకుంది.. కోడలే సినీ పక్కిలో ప్లాన్ ప్రకారమే అత్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.. పెందుర్తి అప్పన్నపాలెంలో భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి నివసిస్తున్నారు.. అత్తను మనవరాలుతో “దొంగ – పోలీస్” ఆట ఆడమని చెప్పి అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించి, కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించింది కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.. ప్రమాదవశాత్తు దీపం అంటు కొని అగ్ని ప్రమాదం జరిగిందని అందరికీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు.. అయితే, మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పెందుర్తి పోలీసులు.. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా అసలు గుట్టు బయటపడింది.. తనపై అనవసరంగా చిరాకు పడుతున్నారని కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

Exit mobile version