AP Crime: ఏ తండ్రి అయినా తన కూతురును కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. ఆమెకు ఏదైనా కష్టం వచ్చిందంటే తట్టుకోలేడు.. తన కూతురు కోసం ఏదైనా చేస్తాడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో.. ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్న బాలుడిపై కత్తితో దాడికి దిగాడు సదరు బాలిక తండ్రి.. ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు బాలుడు.. ఎదురుగా ఉన్న బాలికల పాఠశాలలో టెన్త్ చదువుతోంది బాలిక.. అయితే, తమ కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న సమయంలో బాలికతో పరిచయం పెంచుకున్నాడు బాలుడు.. తరచుగా తనకుమార్తెతో బాలుడు మాట్లాడుతూ ఉండడంతో సహించలేని బాలిక తండ్రి.. బాలుడిపై చాకుతో దాడిచేశాడు. గాయాలపాలైన బాలుడిని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సదరు బాలుడు. దాడిచేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. తన కూతురును ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినందుకే ఆ బాలుడిపై దాడి చేసినట్టు ఆ వ్యక్తి చెప్పినట్టుగా తెలుస్తోంది.
Read Also: TVS King EV MAX: బ్లూటూత్ కనెక్టివిటీతో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 179KM రేంజ్!