NTV Telugu Site icon

Kerala: కేరళలో దారుణం.. టీనేజర్‌పై 64 మంది లైంగిక వేధింపులు..

Kerala

Kerala

Kerala: కేరళలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా 64 మంది తనని లైంగికంగా వేధించారని ఓ దళిత బాలిక ఆరోపించింది. దీంతో ఇప్పుడు వారందరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. కౌన్సిలింగ్ సెషన్‌లో తాను ఎదుర్కొంటున్న బాధను బాలిక వెళ్లకక్కింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఫిర్యాదు మేరకు పతనంతిట్ట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.

మహిళా సమాఖ్య అనే ఎన్జీఓ సభ్యులు తమ దినచర్యలో భాగంగా ఫీల్డ్ విజిట్‌కి భాగంగా బాలిక ఇంటికి వెళ్లిన సమయంలో, ఈ దారుణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ బాలికకు కౌన్సిలింగ్ అందించింది. కౌన్సిలింగ్ సమయంలో సైకాలజిస్ట్ దగ్గర తాను 13 ఏళ్లుగా ఎదుర్కొంటున్న భయానక అనుభవాలను తెలిపింది. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు.

Read Also: Virat Kohli: కుటుంబం మొత్తంతో సాధువును కలిసిన విరాట్.. వీడియో వైరల్

13 ఏళ్ల వయసులో తన పొరుగువాడి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. అతను అశ్లీల చిత్రాలను తనతో పంచుకున్నట్లు చెప్పింది. తన పాఠశాలలో క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్న సదరు బాలికను, శిక్షణా సెషన్లలో లైంగికంగా వేధింపులకు గురిచేసిన సందర్భాలను వెల్లడించింది. తన వీడియోలు కొన్ని సర్క్యులేట్ అయ్యాయని, ఇది ఈ వేధింపులను మరింతగా పెంచినట్లు తెలిపింది.

ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందికి పైగా వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక నుంచి వివరణాత్మక వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత సీడబ్ల్యుసీ పతనంతిట్ట జిల్లా చైర్‌పర్సన్ ఎన్ రాజీవ్ మాట్లాడుతూ.. బాధితురాలకి అవసరమైన సంరక్షణ, రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ కేసు చాలా తీవ్రమైనదని, ఆ బాలిక 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు గురైందని చెప్పాడు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆమెపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని రాజీవ్ తెలిపారు.