NTV Telugu Site icon

Cyber Fraudsters: రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. కలెక్టర్‌ ఫొటో డీపీగా పెట్టి ఎమ్మార్వోలతో చాటింగ్..

Kakinada

Kakinada

Cyber Fraudsters: టెక్నాలజీ పెరుగుతోన్న కొద్ది.. సైబర్‌ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.. సోషల్‌ మీడియాలోని ఇతరుల ఖాతాలను హ్యాక్‌ చేసి.. వారి పేరుతో చాటింగ్‌ చేస్తూ.. వారి ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేస్తున్నారు.. డబ్బులు అడుగుతున్నారు.. అత్యవసరం.. రేపే ఇచ్చేస్తా.. ఎల్లుండి తిరిగి చెల్లిస్తాను అంటూ నమ్మబలుకుతున్నారు.. చివరి వారి ఊబిలో చిక్కుకుని కొందరు జేబులు గుల్లచేసుకుంటున్నారు.. ఇక, ఇప్పటికే వరకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా.. ఇలా కొన్ని సోషల్‌మీడియాలో హ్యాండిల్స్‌కు పరిమితమైన ఈ వ్యవహారం.. ఇప్పుడు వాట్సాప్‌కు కూడా తాకింది.. వాట్సాప్‌ను సైతం హ్యాక్‌ చేసి కొందరు.. ప్రముఖుల ఫొటోలను డీపీలుగా పెట్టి మరికొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు..

Read Also: iPhone 15 Pro Max: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్!

ఇక, తాజాగా, ఈ వ్యవహారం కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్‌ను తాకింది.. కలెక్టర్‌ షాన్‌ మోమన్‌ పేరుతో సైబర్ మోసం చేసే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు.. 88819 42520 నెంబర్ కి కలెక్టర్ ఫొటోను డీపీగా పెట్టిన కేటుగాళ్లు.. కాకినాడ జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మార్వోలకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు.. తాను అత్యవసర మీటింగ్ లో ఉన్నానని.. డబ్బులు తిరిగి రెండు రోజుల్లో రిటర్న్ చేస్తానని మెసేజ్‌లు పెట్టిన కేటుగాళ్లు.. తనకు అత్యవసరంగా రూ.50 వేలు కావాలని మెసేజ్‌లు పెట్టారు.. అయితే, కలెక్టర్‌ ఫొటో డీపీగా ఉన్నా.. కొత్త నంబర్‌ కావడంతో కొందరు ఆరా తీశారు.. అది ఫేక్‌ అని వారికి అనిపించడంతో.. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో.. ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.