Cyber Congress: రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు 10 నెలల పాటు నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రామ్ నిన్న గురువారం ముగిసింది. ఇందులో భాగంగా సైబర్ సేఫ్టీపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ట్రైనింగ్ పొందిన మెంబర్లను సైబర్ అంబాసిడర్లుగా పేర్కొంటారు. వీళ్లు తమ పరిధిలోని విద్యార్థులకు, బంధుమిత్రులకు, చుట్టుపక్కలవాళ్లకు సైబర్ భద్రతకు సంబంధించిన టిప్స్ నేర్పుతారు. తద్వారా వాళ్లను ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా సేవ్ చేస్తారు.
సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించారు. జిల్లాకి 100 మంది విద్యార్థులను, 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్లకు వివిధ అంశాలను బోధించారు. ఇంటర్నెట్ దొంగలు బెదిరింపులకు పాల్పడ్డప్పుడు, వెంబడించినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి?, దీనికి సంబంధించిన చట్టపరమైన రక్షణలు తదితర విషయాలను వివరించారు. ఈ మేరకు 80 వర్చువల్ ట్రైనింగ్ సెషన్లను నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలంగాణ పోలీస్ శాఖ మహిళల భద్రతా విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా వెల్లడించారు.
Ukraine in Top: నమ్మబుద్ధి కాని నిజం. టాప్‌లో నిలిచిన ఉక్రెయిన్.
ఈ ప్రోగ్రామ్‌ను ఈ ఏడాది కూడా ఏర్పాటుచేస్తామని స్వాతి లక్రా తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన 400 మంది సైబర్ అంబాసిడర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము నేర్చుకున్న అంశాలను వెల్లడించారు. ”ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను రిస్క్ లేకుండా ఎలా వాడాలి?, మొబైల్ ఫోన్లకు వచ్చిన పాస్‌వర్డ్‌లను, ఓటీపీలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అనే విషయాలపై పట్టు సాధించాం.
‘సోషల్’గా యాక్టివ్ అయ్యాం. ఇక నుంచి సైబర్ సేఫ్టీపై అలర్ట్‌గా ఉంటాం. ఇంటర్నెట్‌లో ఏది రియల్, ఏది ఫేక్ అనేది తెలుసుకున్నాం. సేఫ్‌గా బ్రౌజింగ్ చేయటం నేర్చుకున్నాం. అందువల్ల ఇప్పుడు ధైర్యంగా ఆన్‌లైన్ యాక్టివిటీస్ నిర్వహించగలం. మేం పొందిన ఈ నాలెడ్జ్‌ని ఇతరులతో షేర్ చేసుకుంటాం. ఇప్పటికే కొంత మందికి నేర్పాం. లోన్ యాప్‌ల ట్రాప్‌లో పడకుండా ఉండటం, మన ప్రైవేట్ డేటాను రక్షించుకోవటం గురించి సూచనలు సలహాలు ఇస్తున్నాం. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని మా ఫ్రెండ్స్‌కి కూడా చెబుతాం” అని అన్నారు.