Crime News: ప్రస్తుతం ఉన్న యువతకు జీవితం విలువ తెలియడం లేదు. చిన్నదానికి, పెద్దదానికి ఆత్మహత్యే సరైన పరిష్కారమంటూ చావుతో చెలగాటలాడుతున్నారు. ఫోన్ పోయిందని, అమ్మానాన్న కొట్టారని, ఫెయిల్ అయ్యామని, ప్రియురాలు వదిలేసిందని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందరిలా చేయి, గొంతు కోసుకుంటే చనిపోను అనుకున్నాడో ఏమో.. ఏకంగా పురుషాంగాన్ని కోసుకొని మృతి చెందాడు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ – జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18 లో దీక్షిత్ రెడ్డి అనే యువకుడు కుటుంబంతో నివసిస్తున్నాడు. అతను ఎంబిబిఎస్ చదువుతున్నాడు. మంచిగా కాలేజ్ కు వెళ్లి వస్తున్న దీక్షిత్.. నేడు విగత జీవిగా కనిపించాడు. అతని పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో దీక్షిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు. అయితే దీక్షిత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
Delhi Rains: 36 గంటలుగా ఢిల్లీలో వర్షాలు.. అప్రమత్తమైన కేంద్రం..!
ఒకవేళ ప్రేమలో విఫఫలమయ్యాడా..? ఎవరితోనైనా గొడవపడ్డాడా.. ? అని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఒక వైద్య విద్యార్థికి ఎక్కడ కోసుకుంటే.. ఎంత సేపటిలో చనిపోతారో అనేది బాగా తెలిసి ఉంటుంది. కానీ, కావాలనే పురుషాంగాన్ని కోసుకొని మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీక్షిత్ ను ఎవరైనా హత్య చేసి.. ఆత్మహత్యగా క్రియేట్ చేశారా.. ? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. దీక్షిత్ మొబైల్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
