Site icon NTV Telugu

Kukatpally Crime: పోలీసులకు చెప్పినా బతకలేదు.. చున్నీతో మొగుడ్ని ఉరేసి చంపిన భార్య

Kukatpally Crime

Kukatpally Crime

Kukatpally Crime: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక ఘోరం వెలుగు చూసింది. అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, కలకాలం ఒకరికిఒకరు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక భార్య తన భర్తను ఏకంగా చున్నీతో ఉరేసి చంపిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సుధీర్‌రెడ్డి-ప్రసన్నలు భార్యాభర్తలు. ఈ దంపతులు కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. ఈక్రమంలో గత ఏడాది డిసెంబర్ 24న ఘటన భార్య ప్రసన్న అగ్ని సాక్షిగా తాళి కట్టిన తన భర్తను చున్నీతో ఉరేసి చంపింది.

READ ALSO: Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్‌.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!

సుధీర్ రెడ్డి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పోలీసులు సుధీర్ రెడ్డి భార్య ప్రసన్నను విచారించగా.. పోలీసుల దర్యాప్తులో భార్య ప్రసన్న.. తన చున్నీతో భర్తను ఉరేసి చంపానని ఒప్పుకుంది. ఈ క్రమంలో పోలీసులు ప్రసన్నను కంది జైలుకు రిమాండ్‌కు తరలించారు. భర్త సుధీర్‌రెడ్డి తన భార్య.. తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని హత్యకు వారం ముందే పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

READ ALSO: Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు

Exit mobile version