తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుందనే సామెత బెట్టింగ్ ఈ వ్యవహారంలో జరిగిందని చెప్పవచ్చు. ముంబై హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న బెట్టింగ్ వ్యవహారం బట్టబయలు చేసేందుకు పోలీసులు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిన వెంటనే బెట్టింగ్ల జోరు పెరిగిపోతున్నది. ఇలాంటి బెట్టింగ్ లను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Read Also: Kurnool: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కి బుద్ధి చెప్పిన యువతి
అయితే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బెట్టింగ్ పాల్పడుతున్న కచ్చితమైన సమాచారం పోలీసులకు వచ్చింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా బుకిలను ఏర్పాటు చేసుకొని బెట్టింగ్ లకు పాల్పడుతున్న అమిత్ గుజరాతికు సంబంధించిన సమాచారం వచ్చింది. ప్రతి సీజన్లో కూడా వందల కోట్ల రూపాయలను పాల్పడుతున్నట్లుగా పోలీసులు పోలీసుల విచారణలో బయట పడింది. అయితే గుజరాతి కేంద్రంగా నడుస్తున్న ఈ బెట్టింగ్ మాఫియా ను పూర్తిగా కట్టడి చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా గుజరాత్ నుంచి నడుపుతున్న వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ పోలీసులకు వాంటెడ్ గా ఉన్న బెట్టింగ్ ముఠా ను పట్టుకునేందుకు గుజరాత్ లోని ఒక హోటల్ కి పోలీసులు వెళ్లారు.
అయితే పోలీసులకు ఊహించని రీతిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అమిత్ గుజరాతి తారసపడ్డాడు. దీంతో తాము కు కావలసిన బెట్టింగ్ ముఠా తో పాటు అదనంగా దొరికిన అమిత్ గుజరాత్ పోలీసులు వెంటనే పట్టుకున్నారు. మొత్తం 20 మంది సభ్యులు గల ముఠాని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి కొన్ని లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటుగా బెట్టింగ్ కావలసిన పరికరాలను కూడా స్వాధీనపర్చుకున్నారు. దేశవ్యాప్తంగా బూకీ లను ఏర్పాటు చేసుకుని పాల్పడుతున్న అధికారులు చెప్పారు.
