NTV Telugu Site icon

Shocking: మమ్మల్ని కలిపి దహనం చేయండి.. ఆర్మీ, ఐఏఎఫ్ జంట ఆత్మహత్య..

Latest Telugu News

Latest Telugu News

Shocking: ఆగ్రాలో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారి అయిన భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌజ్‌లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. తన భర్త దీనదయాళ్ దీప్‌తో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని మహిళ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

Read Also: Bahraich violence: బహ్రైచ్ దుర్గాపూజ సమయంలో హింసకు కారణమైన నిందితుల ఎన్‌కౌంటర్..

బీహార్‌కు చెందిన దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా, అతని భార్య రేణు తన్వర్ ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గరౌటా ఆఫీసర్స్ గెస్ట్ హౌస్‌లో నివసించారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు బుధవారం సమాచారం అందింది. సమాచారం ప్రకారం.. దీప్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రేణు ఒక రోజు తర్వాత తీవ్ర చర్యకు ఒడిగట్టింది. మంగళవారం రాత్రి గెస్ట్ హౌజ్‌లో ఫ్యాన్‌కి వెలాడుతున్న రేణూ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీప్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Show comments