NTV Telugu Site icon

Delhi: స్పెషల్ పోలీసుల దాడి.. రూ.2వేల కోట్ల డ్రగ్స్ సీజ్

Delhidrugs

Delhidrugs

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఢిల్లీలోని రమేష్ నగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ పట్టుకున్నారు. గురువారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్‌ను పట్టుబడింది. దీని విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7 వేల కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Triptii Dimri : యానిమల్ రిలీజయ్యాక మూడు రోజులు ఏడ్చా.. భాభీ 2 షాకింగ్ కామెంట్స్

రమేష్ నగర్‌లోని మూసి ఉన్న దుకాణం నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.2,000 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. ఈ డ్రగ్‌ను నమ్‌కీన్ ప్యాకెట్లలో ఉంచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Divvela Madhuri: తిరుమలలో రీల్స్.. దివ్వెల మాధురిపై కేసు నమోదు

ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు జీపీఎస్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరాదారుని ట్రాక్ చేసి.. పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్‌లో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. నిందితులు లండన్‌కు పరార్‌ అయినట్లు తెలిపారు. అక్కడ లభించిన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల్లో రూ. 7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. గత వారం ఢిల్లీలో 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలో దాడులు చేసి.. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో జస్సీ అలియాస్‌ జితేంద్ర పాల్ సింగ్‌ను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అతను లండన్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరికి దేశంలోని పలు నేరాలు, అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న పాన్ ఇండియా నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

Show comments