జన్మదిన వేడుకల్లో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై ఒకరూ బీరు బాటిళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సాయి రెడ్డి అనే యువకుడిని తోటి స్నేహితుడు బీరు సీసాలతో కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మ బండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి నిర్వహించాడు.
ఈ వేడుకల్లో వారంతా మద్యం సేవించారు. మద్యం మత్తులో మాటా మాటా పెరిగింది. ఈక్రమంలో సాయిరెడ్డి అనే యువకుడిపై మిగిలిన యువకులు బీరు బాటిళ్లతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఓ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
