Site icon NTV Telugu

Guntur Crime: గుంటూరులో దారుణం.. స్కూల్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ.. కొట్టి చంపి బావిలో పడేశారు..!

Crime

Crime

Guntur Crime: గుంటూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది.. స్కూల్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో ఓ బాలుడి హత్యకు దారి తీసింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో తోటి విద్యార్థిని కొట్టి చంపి బావిలో పడేశారు సహచర విద్యార్థులు.. ఈ ఘటనతో తీవ్ర విషయంలోకి వెళ్లిపోయింది సదరు విద్యార్థి కుటుంబం.. గత నెల 24వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన గురించి విషయం తెలిసినా, పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

Read Also: Election Campaign: నేటితో ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం

విద్యార్థుల ఘర్షణలో మృతి చెందిన బాలుడు షేక్ సమీర్‌గా చెబుతున్నారు.. స్థానిక జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమీర్.. సెక్షన్ల మధ్య వివాదాలతో విద్యార్థులు గొడవ పడటంతో ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. అక్టోబర్ 21వ తేదీన సమీర్ ను ఈత కొడదామని తీసుకొని వెళ్లినా కొందరు విద్యార్థులు.. ఊరి శివార్లలో దాడి చేసి కొట్టి, బావిలో పడేసినట్లు సమాచారం.. బాలుడి మృతదేహాన్ని బయటకు తీసిన బంధువులకు అప్పగించారు అధికారులు.. అయితే, నెల రోజులు కావస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది.. అయితే, తమకు న్యాయం చేయాలని.. తమ కుమారుడి ప్రాణాలు తీసినవారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది..

Exit mobile version