Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!
- ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు
- హత్య చేసేందుకు మొబైల్‌లో సర్చ్
- నిందితుడు రాజేష్ మంచోడేనన్న బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజే.. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బుధవారం (నవంబర్ 4) ఉదయం హత్యకు గురయ్యారు. మృతులు భర్త రాజేష్ (55), భార్య కోమల్ (47), కూతురు కవిత (23)గా పోలీసులు గుర్తించారు. ఉదయం మార్నింగ్ వాకింగ్ వెళ్లొచ్చేటప్పటికీ చనిపోయి ఉన్నారని కుమారుడు రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అజ్ఞాత వ్యక్తులు వచ్చినట్లు కనబడలేదు. దీంతో రాజేష్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఇది కూడా చదవండి: Lip Care Tips: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా..? మృదువైన పెదాల కోసం ఇలా చేయండి
నిందితుడు రాజేష్‌ను కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని హత్య చేసేందుకు మొబైల్‌లో వెబ్ స్టోరీలు చూసినట్లుగా కనుగొన్నారు. అంతేకాకుండా ఏ విధంగా హత్య చేయాలో అన్నదానిపై అనేక కోణాలను అన్వేషించినట్లుగా గుర్తించారు. విష ప్రయోగం ద్వారా కూడా చంపేందుకు సర్చ్ చేశాడు. కానీ ఇవన్నీ కుదరకపోవడంతో తండ్రికి సంబంధించిన ఆర్మీ కత్తిని తీసుకుని ముగ్గురిని చంపేశాడు. మొదటిగా సోదరిపై దాడి చేశాడు. చెయ్యి అడ్డుపెడితే విరిగిపోయింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. దాడి చేస్తూనే ఉన్నాడు. ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అంతస్తు పైకి వెళ్లి తండ్రిపై దాడి చేశాడు.. అనంతరం తల్లిపై దాడి చేసి ముగ్గురి ప్రాణాలు తీశాడు.
ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో రాజేష్‌కు ఎలాంటి విభేదాలు లేవని బంధువులు తెలిపారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. అందరూ బాగానే ఉంటారని చెప్పుకొచ్చారు. కుమారుడికి హై-ఎండ్ మోటార్ సైకిల్ కొనిచ్చాడని బంధువు తెలిపారు. అంతేకాకుండా జిమ్‌కు అవసరమైన వస్తువులతో పాటు మంచి ఆహారం కూడా తండ్రి అందిస్తున్నాడని వెల్లడించారు. అయితే సోదరిని మాత్రం చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. సరాదాగా అంటున్నాడేమో అనుకున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Basil Joesph : డైరెక్షన్ వద్దు.. యాక్టింగే ముద్దు
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!