Child Trafficking : హైదరాబాద్ నగరం నడిబొడ్డున పసికందులను విక్రయిస్తున్న ఒక భారీ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ ముఠా కార్యకలాపాలను గమనించిన పోలీసులు, మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు కేవలం స్థానికంగానే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ప్రధానంగా అహ్మదాబాద్ వంటి నగరాల నుండి చిన్న పిల్లలను హైదరాబాద్‌కు తరలిస్తూ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్క శిశువును సుమారు 15 లక్షల రూపాయల భారీ ధరకు సంతానం లేని వారికి విక్రయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Kandula Durgesh: కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ ముఠా నెట్‌వర్క్ ఎంత లోతుగా ఉందంటే, నగరంలోని సుమారు ఎనిమిది ప్రముఖ ఆసుపత్రులలో వీరు ఏజెంట్లుగా చొరబడి తమ దందాను సాగిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చే దంపతుల వివరాలను సేకరించి, వారికి ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ చిన్నారులను అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా సుమారు 15 మంది పిల్లలను అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించగా, తాజా ఆపరేషన్‌లో ఇద్దరు చిన్నారులను వీరి బారి నుండి సురక్షితంగా కాపాడారు. అహ్మదాబాద్ నుండి పిల్లలను ఎలా తీసుకొస్తున్నారు, ఈ దందాలో ఇంకా ఏయే పెద్దల హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లాది రూపాయలు గడిస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న ఆసుపత్రి యాజమాన్యాల పాత్రపై కూడా సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
Tollywood Pro League: దిల్ రాజు అండతో వంశీ చాగంటి ‘బిగ్ ప్లాన్’
