Child Trafficking : హైదరాబాద్ నగరం నడిబొడ్డున పసికందులను విక్రయిస్తున్న ఒక భారీ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ ముఠా కార్యకలాపాలను గమనించిన పోలీసులు, మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు కేవలం స్థానికంగానే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ప్రధానంగా అహ్మదాబాద్ వంటి నగరాల నుండి…