AP Crime: చికెన్ పకోడీ వివాదం ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వచ్చింది. మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలి చేసింది. మరొకరిని హంతకుడిగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసపలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లాడు. చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే, షాపు యజమాని లేదని చెప్పాడు.
Read Also: Samantha : ‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన సమంత
అయితే ఎట్టి పరిస్థితుల్లో తనకు చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు మిన్నారావు. శంకర్ కాదని చెప్పినా వినలేదు. మరింత గదమాయించాడు. షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్ పై దూసుకొచ్చాడు. ఆపై శంకర్ పీక నొక్కి కింద పడవేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ సైతం పక్కనే ఉన్న సుత్తిని తీసి మిన్నారావు తలపై బలంగా మోదాడు. అప్పటికి ఆవేశం తగ్గలేదు ఆయనలో. పక్కన ఉన్న కత్తిని తీసి పీక కోశాడు. మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేసాడు. దీనిపై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు .
