NTV Telugu Site icon

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. ఆస్తి వివాదంలో జర్నలిస్ట్ కుటుంబం హత్య

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఆస్తి వివాదంలో జర్నలిస్టు కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఆజ్‌తక్ జిల్లా రిపోర్టర్ సంతోష్ కుమార్ టోప్పో తల్లిదండ్రులు, సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Adani : అదానీ తీసుకున్న నిర్ణయం వల్ల కుప్పకూలిన కంపెనీ షేర్లు.. ఒక్కరోజులోనే ఎన్నికోట్ల నష్టమంటే ?

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో ఆస్తి వివాదం చెలరేగింది. అయితే సంతోష్ మాఘే టోప్పో (57), బసంతి టోప్పో (55), అతని సోదరుడు నరేష్ టోప్పో (30) వ్యవసాయం పొలానికి వెళ్లారు. అయితే పొలం కుటుంబ కలహాలకు కేంద్రంగా ఉంది. దీంతో ప్రత్యర్థులు కత్తులు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో సంతోష్ తల్లిదండ్రులతో పాటు సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. బసంతి, నరేష్ తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాఘేను మాత్రం అంబికాపూర్ మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏడుగురు వరకు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసినట్లుగా సమాచారం. మరో సోదరుడు ఉమేష్ టోప్పో దాడి నుంచి తప్పించుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు.

ఇది కూడా చదవండి: Off The Record: కేడర్‌ విషయంలో వైసీపీ అధ్యక్షుడిలో వచ్చిన మార్పేంటి..?

పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తి విషయంలో కొన్ని నెలల నుంచి వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కేసు న్యాయస్థానంలో ఉంది. అయితే తీర్పు రాకముందే నిందితులు వ్యవసాయం చేస్తున్నారని.. దీంతో సంతోష్ కుటుంబం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో రిపోర్టర్ సంతోష్ అక్కడ లేడు. ఖర్గవా, ప్రతాపూర్‌కు చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..

Show comments