Site icon NTV Telugu

Physical harassment: ములాకత్‌కు వచ్చే ఖైదీల భార్యలే టార్గెట్‌..! చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌పై వేటు

Cherlapally Jail

Cherlapally Jail

మహిళలు ఎక్కడున్నా.. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడంలేదు.. పసికూనల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, తాజాగా, చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు వేసింది జైళ్ల శాఖ.. జైలులో ఉన్నవారిని కలిసేందుకు, చూసేందుకు సాధారణంగా ములాకత్‌కు వస్తుంటారు.. ఖైదీల కుటుంబ సభ్యులు.. అయితే, ములాకత్‌కు వచ్చే ఖైదీల భార్యలను వేధిస్తున్నాడని దశరథంపై ఆరోపణలు వచ్చాయి.. దీంతో, జైళ్ల శాఖ డీజీ జితేందర్ చర్యలు తీసుకున్నారు.

Read Also: Botsa Satyanarayana: పవన్‌ కల్యాణ్‌పై మరోసారి ఫైర్‌ అయిన మంత్రి బొత్స..

తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం డీజీ వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన ఆయన… పరిపాలనకు భంగం కలిగిస్తున్నాడనే ఆరోపణలపై డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు ఆదేశించారు.. ఆయనను చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. కాగా, దశరథంపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదంటున్నారు అధికారులు.. గతంలో జైలులో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని కూడా లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి.. దశరథంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‭లో కేసు కూడా నమోదైంది. మళ్లీ ఆరోపణలు రావడంతో ఈ సారి చర్యలకు దిగింది జైళ్ల శాఖ.

Exit mobile version