NTV Telugu Site icon

Chandigarh : దారుణంగా దంపతుల హత్య.. ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీ..

Dead Body Chandigarh

Dead Body Chandigarh

దొంగలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు.. డబ్బుల కోసం అడ్డు వచ్చిన వారిని అతి దారుణంగా నిర్దాక్ష్యంగా చంపుతున్నారు.. పోలీసుల కళ్లు కప్పేందుకు కూడా కొత్త మార్గాల ను వెతుకుంటున్నారు. ఈ క్రమంలో హత్యలు చేస్తున్న ఘటనలు కూడా దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా ఛండీగడ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. చోరికి వచ్చిన దొంగలు ఓ వృద్ధ జంటను అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే.. రాజ్‌కుమార్, చంపా దేవి గా గుర్తించబడిన దంపతులు తమ కుమారుడు ఇంగ్లండ్‌ లో నివసిస్తున్నందున వారి కుమార్తె చండీగఢ్‌లో చదువుతుండగా ఒంటరిగా నివసించారు. ఇంట్లో కొన్ని ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోవడంతో చోరీకి పాల్పడిన దొంగలే హత్యకు పాల్పడి ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణను మొదలు పెట్టారు..

ఈ హత్య గురువారం అర్థరాత్రి జరిగినట్లు అనుమానిస్తున్నప్పటికీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.. గ్రామస్తుల వివరాల ప్రకారం, దంపతుల ను పదునైన ఆయుధాలతో కొట్టారు.. దాంతో తీవ్ర గాయాలు అయ్యాయి.. అది వారి మరణానికి దారి తీసింది. దీనిపై పోలీసులు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. మూలాల ప్రకారం, దంపతుల నోళ్లలో పాలిథిన్ బ్యాగ్‌లు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రాజిందర్ మన్హాస్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తుల పై కేసు నమోదు చేయబడింది. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం సివిల్‌ ఆసుపత్రికి పంపించాం.. రిపోర్ట్ వస్తే గానీ పూర్తి వివరాలను అందించలేమని తెలిపారు.. త్వరలోనే ఈ ఘటనకు కారకులు అయిన వారిని అరెస్ట్ చెస్తామని వెల్లడించారు.. ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు.. గతంలో చాలానే జరిగాయి.. ఇప్పటికి కొన్ని కేసుల కు కారణాలు తెలియరాలేదు..