Cambodia Cyber Scam: కేజీఎఫ్‌ను తలపించిన సైబర్ సామ్రాజ్యం.. వందల సంఖ్యలో ఉద్యోగులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cambodia Cyber Scam: రోజుకు 18 గంటలు పని.. అడ్డు చెబితే అంతు చూస్తారు.. డెయిలీ ఇచ్చే టాస్క్ కంప్లీట్ చేయాలి.. టార్గెట్ పూర్తి చేయకపోతే.. చుక్కలు చూపిస్తారు..!! సూర్యున్ని చూడాలన్నా కష్టమే!! కంబోడియాలోని అలాంటి నిర్బంధ వాతావరణంలో పని చేస్తున్న వారికి థాయ్‌లాండ్ పోలీసులు విముక్తి కల్పించారు. ఆ సైబర్ నేరగాళ్ల ముఠాకు చిక్కిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.
కేజీఎఫ్‌ను తలపించిన సైబర్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. బయటపడ్డ భారీ సైబర్ నేరగాళ్ల ముఠా బాగోతం బయటపడింది. సినిమాల్లో మాత్రమే కనిపించే భయానక సామ్రాజ్యాలు నిజ జీవితంలోనూ ఉంటాయా? కేజీఎఫ్ సినిమాలోలాగే వందల మందిని బంధించి, ప్రైవేటు సైన్యంతో కాపలా పెట్టి, భయంతో పనిచేయించే దృశ్యాలు కేవలం కల్పితమే అనుకున్న ప్రపంచం.. కంబోడియా సరిహద్దుల్లో ఒక్కసారిగా కదిలిపోయింది. థాయ్‌లాండ్ సైన్యం చేపట్టిన సైనిక చర్యతో వెలుగులోకి వచ్చిన సైబర్ నేర సామ్రాజ్యం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
Cyber Crime: నువ్వు చాలా కంత్రీలా ఉన్నావు బేటా.. కొంప ముంచిన డిజిటల్ ట్రాన్స్ఫర్!
కంబోడియా- థాయ్‌లాండ్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. థాయ్ సైన్యం ఓస్మాచ్ పట్టణంపై దాడి చేసింది. వైమానిక, ఉపరితల దాడుల అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్యం.. అక్కడి ఆరు అంతస్తుల భారీ భవన సముదాయాన్ని పరిశీలించింది. బయటకు చూస్తే ఐటీ కంపెనీలా కనిపించిన ఆ భవనం లోపల మాత్రం భారీ సైబర్ మోసాల కర్మాగారం నడుస్తోంది..
మానవ అక్రమ రవాణా ముఠాల సహాయంతో ఉద్యోగాల పేరుతో వివిధ దేశాల యువతను కంబోడియాకు రప్పించారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని.. బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేశారు. అనంతరం వారితో డిజిటల్ అరెస్టులు, బ్యాంకు మోసాలు, ఫేక్ పోలీసు కాల్స్, ఆన్‌లైన్ స్కామ్‌లు చేయించారు. బందీల్లో భారతీయులు, అందులో తెలుగు వారు కూడా ఉన్నట్టు సమాచారం. భయంతో, బలవంతంతో సైబర్ నేరాలకు పాల్పడాల్సి వచ్చిన వారి పరిస్థితి కేజీఎఫ్‌లోని బందీలను తలపించేలా ఉంది.
మరోవైపు ఆరు అంతస్తుల భవనంలో భారత్, చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, బ్రెజిల్ తదితర దేశాల పోలీస్ స్టేషన్లను తలపించే సెట్లు ఏర్పాటు చేశారు. ఆయా దేశాల పోలీసుల దుస్తులు, జాతీయ జెండాలు, నకిలీ గుర్తులు సిద్ధంగా ఉంచారు. వియత్నాం బ్యాంకును పోలిన సెటప్, క్యాష్ కౌంటర్లు, గోడలపై ప్రకటనలు.. ఇలా ఇవన్నీ అమాయకులను నమ్మించే నాటక రంగస్థలాల్లా తయారు చేశారు. గదులన్నింటిలో వందలాది కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, సిమ్ కార్డులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు థాయ్ పోలీసులు. బోర్డులపై రోజువారీ లక్ష్యాలు, ఎంత డబ్బు వసూలు చేశామో రాసి ఉండటం ఈ వ్యవస్థ ఎంత వ్యవస్థీకృతంగా పనిచేస్తోందనేది తెలియజేస్తోంది.
ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్‌లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
ఇక బందీలు పారిపోకుండా ప్రత్యేక శిక్షణ పొందిన రక్షణ సిబ్బంది కాపలా ఉండేవారు. ఎదురు తిరిగితే హింసించేవారని సమాచారం. థాయ్ సైన్యం దాడి చేసిన తర్వాతే బందీలకు బయటపడే అవకాశం దొరికింది. ప్రస్తుతం వారి పాస్‌పోర్టుల ఆధారంగా గుర్తించి సంబంధిత దేశాలకు సమాచారం అందిస్తున్నారు థాయ్ పోలీసులు. అంతర్జాతీయ అంచనాల ప్రకారం, ఇలాంటి సైబర్ నేరాల ద్వారా ఏటా సుమారు 12.5 బిలియన్ డాలర్లు కాంబోడియాకు చేరుతున్నట్టు చెబుతున్నారు.
ఈ అంతర్జాతీయ నేర సామ్రాజ్యాల దుష్ప్రభావం గ్రామీణ భారతానికీ తాకుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే కూలీ, సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఫోన్ హ్యాక్ చేసి వ్యక్తిగత ఫోటోలు బయటపెడతామని బెదిరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్, పోలీసుల పేరుతో వచ్చే బెదిరింపులు, బ్యాంకు వివరాల కోసం అడిగే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ