Site icon NTV Telugu

Bus Accident : లోయలో పడ్డ టూరిస్ట్‌ బస్సు.. డ్రైవర్‌ సహా ఏడుగురు మృతి..

తిరుపతిలోని చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రెడ్ శ్యాండిల్ టాస్క్ఫోర్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని బస్సులో ఉన్నవారిని బయటకు తీస్తున్నారు. సుమారు 10 అంబులెన్స్‌లు తిరుపతి, చంద్రగిరి, బాకరాపేట, పాకాల నుంచి వచ్చాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సంఘటనా స్థలంలో 6మంది, హాస్పిటల్ లో ఒకరు మృతి చెందారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు రిస్క్యూ టీం లో పాల్గొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేంతవరకు జిల్లా కలెక్టర్ హరినారాయన్ పర్యవేక్షించారు. అయితే మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Exit mobile version