NTV Telugu Site icon

Crime News: చెల్లితో ఎఫైర్.. ‘ఉప్పెన’ సీన్ రిపీట్ చేసిన అన్న

Crime

Crime

Crime News: ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఇద్దరు చిన్నారులకు తండ్రి లేకుండా చేసింది.. ఒక కుటుంబానికి పెద్దను దూరం చేసింది. వివాహేతర సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న కొంతమంది మాత్రం మారడం లేదు. ఆ ఊబిలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి తన చెల్లెలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అన్న, తన స్నేహితులతో అతడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఆదిలాబాద్ లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌లో బండారి కిరణ్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భాగ్యశ్రీ అనే భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో అందమైన కుటుంబం.. ఆలుమగల మధ్య విబేధాలు లేకుండా జీవితం సవ్యంగా సాగిపోతున్న సమయంలో కిరణ్ చుట్టాలమ్మాయి రమ్య వీరి జీవితంలోకి ప్రవేశించింది. ఒక పెళ్ళికి వెళ్లిన కిరణ్ కు రమ్య పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఇక ఈ విషయం రమ్య అన్న శివకుమార్ కు తెల్సింది. దీంతో అతను తన మేమంతా, బాబాయ్ లను తీసుకొని కిరణ్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయినా కిరణ్ లో మార్పు రావడం పక్కనపెట్టి.. రమ్యను తీసుకొని గుడిలో వివాహమాడాడు. ఇక చెల్లిని పెళ్లిచేసుకున్నాడు అన్న కోపముతో రగిలిపోయిన శివ.. తన స్నేహితులు, ఆర్మీ ఉద్యోగి అయిన సంతోష్ తో కలిసి పథకం ప్రకారం కిరణ్ కు మత్తుమందు కలిపిన మందు తాగించి సెప్టెంబర్ 28న గుడిహత్నూర్ మండలంలోని దంపూర్ డంప్ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్య చేశారు. అతడి మర్మాంగంపై కొట్టి, గొంతు నొక్కి దారుణంగా హత్య చేశారు. ఇక స్నేహితులతో హైదరాబాద్ వెళ్లివస్తాను అని చెప్పిన భర్త ఇంకా రాకపోయేసరికి భయపడిన భాగ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్టోబర్ 8 న అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవలే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితుల కోడం గాలింపు చర్యలు చేపట్టారు.