Site icon NTV Telugu

Brazil: శరీరానికి అంటి పెట్టుకున్న 26 ఐఫోన్లు, ప్రయాణంలో యువతి మృతి.. అసలేమీ ఏం జరిగింది?

Brazil

Brazil

Brazil: బ్రెజిల్‌ లోని పరానా ప్రాంతంలో ఒక బస్సులో 20 ఏళ్ల యువతి మృతదేహంగా కనుగొనబడడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన గారాపువావా అనే ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన యువతికి శరీరానికి 26 ఐఫోన్లు అంటించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అక్కడి సివిల్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

Mrunal Thakur: డెకాయిట్ కోసం మృణాల్ ఎదురుచూపులు!

ఇకపోతే, బస్సు ప్రయాణంలో ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురై గాలితీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్టు ప్రవర్తించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆమెకు ఒక్కసారిగా భయానక లక్షణాలు కనిపించడంతో అత్యవసర సేవల బృందాన్ని పిలిపించారు. బస్సులోనే ప్రాథమిక చికిత్స ఇచ్చినా, ఆమెకు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. సుమారు 45 నిమిషాల పాటు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వైద్య బృందం ఆమెను కాపాడలేక పోయింది.

BSF Tradesman Recruitment: BSFలో ట్రేడ్స్‌మన్ కానిస్టేబుల్ 3588 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా!

ఇక పోలీసుల వివరాల ప్రకారం, ఆమె శరీరానికి నేరుగా అంటించిన 26 ఐఫోన్లు ఉన్నట్టు వారు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైంటిఫిక్ పోలీస్, సివిల్ పోలీస్ ఫోరెన్సిక్ బృందాలు సంఘటన స్థలానికి విచారణకు వచ్చాయి. స్నిఫర్ డాగ్‌ను కూడా వాడి మాదకద్రవ్యాల కోసం తనిఖీ చేసినా ఎటువంటి మాదక పదార్థాల జాడ కనిపించలేదు. అయితే, ఆమె లగేజ్ లో పలు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. యువతీ మృతి కారణాన్ని పూర్తిగా స్పష్టంగా తేల్చేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఐఫోన్లన్నింటిని బ్రెజిల్‌ ఫెడరల్ రెవెన్యూ సర్వీస్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు స్మగ్లింగ్ సంబంధముందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

Exit mobile version