Site icon NTV Telugu

Crime: ప్రేయసి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య

Lover Suicide

Lover Suicide

అమ్మాయి ప్రేమించడం లేదని.. ప్రేమించి తనను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటోందని.. ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇలా చాలా మంది యువకులు వివిధ కారణాలతో వారు చనిపోవడమో లేక అమ్మాయిలను చంపడమో చేస్తూ తమ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు. ప్రేయసి లేకపోతే జీవితమే లేదన్నట్లుగా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలానే.. ఓ ప్రియుడు తన ప్రేయసికి వేరే అతడితో పెళ్లి జరుగుతోందని తెలిసి.. ఆ వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జులై1న హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ వద్ద జరగగా.. సదరు యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.

Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిక్ అశ్వక్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలోనే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలిసి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఏం చేయలేక పెళ్లి జరుగుతున్న ఫంక్షన్‌హాల్ వద్దకు చేరుకుని కల్యాణ మండపం ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లోనే వెళ్లి వధువును హత్తుకునే ప్రయత్నం చేయగా.. బంధువులు ఆమెను పక్కకు లాగారు. స్థానికులు వెంటనే అతనిపై మంటలను ఆర్పేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. వధువు స్వల్ప గాయాలతో బయటపడింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ అశ్వక్ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. వధువు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version