NTV Telugu Site icon

Chennai Atrocity: చెన్నైలో దారుణం.. రోడ్డు పక్కన సూట్‌కేసులో యువతి డెడ్‌బాడీ

Tn

Tn

Chennai Atrocity: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ఈరోజు (గురువారం) దారుణం చోటు చేసుకుంది. నగరంలోని తురైపాకం ప్రాంతంలో రోడ్డు పక్కనే స్థానికులకు ఓ సూట్‌‌ కేసు కనబడింది. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు సమాచారం అందించారు. ఇక, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌‌ కేసు ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Read Also: Haryana Elections : 5 లక్షల ఇళ్లు, 2 లక్షల ఉద్యోగాలు, బాలికలకు స్కూటర్లు.. హర్యానాలో బీజేపీ హామీలు

అయితే, ఆ సూట్ కేసులో ముక్కలు ముక్కలుగా చేసిన యువతి శరీర భాగాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఆ తర్వాత శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక, చనిపోయిన మహిళ రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మాధవరంకు చెందిన దీప గుర్తించారు‌. హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Show comments