NTV Telugu Site icon

Uttar Pradesh: బీజేపీకి మద్దతు ఇస్తుందని దళిత యువతిని హత్య చేసిన ఎస్పీ నేత..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల వేఠ ఆ రాష్ట్రంలోని కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఒక దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో లభించడం సంచలనంగా మారింది. ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు, ఈ నేరం వెనక రాజకీయ ఉద్దేశ్యం ఉన్నట్లు యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

హత్యకు ముందు యువతిపై అత్యాచారం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కర్హల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని యువతి ప్రచారం చేసింది, ఇది ప్రశాంత్‌కి కోపం తెప్పించిందని కుటుంబం పేర్కొంది. బీజేపీకి మద్దతుగా నిలిచినందుకే ఈ హత్య చేశారని, సమాజ్ వాదీ(ఎస్పీ)కి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రశాంత్ యువతిని బెదిరించినట్లు తెలుస్తోంది.

Read Also: Nayanthara: నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?

కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. నవంబర్ 19న బెదిరింపులు వచ్చాయని, అదే రోజు ఇద్దరు నిందితులు యువతిని బైక్‌పై తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యలు తెలిపారు. బుధవారం ఆమె మృతదేహం గోనె సంచిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మెయిన్‌పురి జిల్లాలో ఉన్న కర్హాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీ కావడంతో బుధవారం పోలింగ్ జరిగింది. 1993 నుండి సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పరిగణించబడుతున్న పార్టీ అఖిలేష్ యాదవ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఈ స్థానం నుండి పోటీకి దింపింది. ఈ ఎన్నికల బీజేపీకి, ఎస్పీకి ప్రతిష్టాత్మకంగా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ మామ అనుజేష్ యాదవ్‌ని బీజేపీ పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో యాదవులు 1.4 లక్షల మంది ఉండగా, దళితులు 40,000, ముస్లింలు 15,000 మంది ఓటర్లు ఉన్నారు.