Site icon NTV Telugu

Body Of Missing Indian: మేరీల్యాండ్‌లో మిస్సింగ్.. భారతీయ ఇంజనీర్ మృతదేహం లభ్యం

Ankit Bagai

Ankit Bagai

భారతీయ-అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 30 ఏళ్ల అంకిత్ బగాయ్ ఏప్రిల్ 9న అదృశ్యమయ్యాడు. అంకిత్ మృతదేహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ బగాయ్ అనే వ్యక్తిని మృతదేహాన్ని చర్చిల్ సరస్సులో గుర్తించారు. నీటిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంకిత్ బగాయ్ చివరిసారిగా ఏప్రిల్ 9 న ఉదయం 11.30 గంటలకు మైల్‌స్టోన్ ప్లాజా సమీపంలోని చికిత్సా కేంద్రం నుండి బయలుదేరినప్పుడు కనిపించాడు. ఆ తర్వాత అతని జాడ లేకపోవడంతో కుటుంబం సభ్యులు వెతికారు.
Also Read:Mohammed Siraj : అదరగొట్టిన హైదరాబాదీ..
అయితే, అంకిత్ ఆచూకి తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అంకిత్ చివరిసారిగా కనిపించిన సమీపంలోని షాపింగ్ సెంటర్‌తో సహా అనేక ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. బగాయ్ తప్పిపోయిన రోజున, చర్చిల్ సరస్సులో ఒక వ్యక్తిని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version