Site icon NTV Telugu

Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు

Crime

Crime

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో దారుణ హత్య జరిగింది. లోకల్ బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్‌ను గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెట్‌పురా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Read Also: Bihar Robbery: రూ.25 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ.. పోలీసులు కాల్పులు

సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త రాంవిలాస్ ఠాకూర్ ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య రక్తం మడుగులో పడి ఉందని తెలిపాడు. ఈ ఘటనపై భర్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఏఎస్పీ చౌబే మాట్లాడుతూ.. సంఘటన జరిగిన సమయంలో 22 ఏళ్ల కుమార్తె కూడా ఇంట్లోనే ఉందని తెలిపారు. ఈ ఘటనకు కేవలం 10 నిమిషాల ముందు ఆమె స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఈ సమయంలో రాణి ఠాకూర్ పై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలం నుండి ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Trivikram: త్రివిక్రమ్’కి హీరో దొరికాడోచ్?

కాగా.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలే ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణుల బృందం సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడిని త్వరలో అరెస్టు చేస్తామని.. ఈ హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version