Site icon NTV Telugu

Wife kills husband: లవర్‌తో అభ్యంతరకర స్థితిలో భార్య.. చివరకు భర్త హత్య..

Wife Kills Husban

Wife Kills Husban

Wife kills husband: భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. భార్య, ఆమె లవర్ ఇద్దరూ కలిసి అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగింది. భార్య, ఆమె లవర్ ఇద్దరు శృంగారం చేస్తుండగా భర్తకు దొరికారు. దీని తర్వాత కొన్ని రోజులకే వారిద్దరు కలిసి భర్తను హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

సదరు మహిళకు తల్లిగారి ఇంటికి సమీపంలో నివసించే ట్యూషన్ టీచర్‌తో అక్రమ సంబంధం ఉంది. అయితే, ఈ ఆరోపణల్ని మహిళ ఖండించింది. హత్యకు గురైన వ్యక్తిని 30 ఏళ్ల సోను కుమార్ గా గుర్తించారు. బాధితుడు గురువారం రాత్రి తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. అతడి శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి. శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయిందని పోలీసులు తెలిపారు.

Read Also: Mothevari Love Story : ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్‌‌ రిలీజ్

వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన సోను 5 ఏళ్ల క్రితం స్మితాదేవిని వివాహం చేసుకున్నాడు. స్మిత మాధో విషన్‌పూర్‌లో తన తల్లి ఇంట్లోనే ఉండాలని పట్టుబడుతోంది. దీంతో భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. గ్రామ పంచాయతీలో వివాదంపై పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. పిల్లలకు ట్యూషన్ కోసమని సోనూ ఇంటికి హరి ఓం అనే వ్యక్తి తరుచుగా రావడంతో ఈ వివాదాలు మరింత పెద్దవయ్యాయి.

ఇటీవల సోనూ ఇంటికి ఆలస్యంగా వచ్చిన సమయంలో అతడి భార్య, లవర్ హరి ఓంతో అసభ్యకరమైన స్థితిలో పట్టుబడింది. దీని తర్వాత వాదన చెలరేగింది. సోనూ హరి ఓంని తిరిగి రావద్దని హెచ్చరించాడని సోనూ తండ్రి పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత హరిఓం కొన్ని రోజులు సోనూ ఇంటికి రాలేదు. హత్య జరిగిన రాత్రి సోనూ తన ఆటో రిక్షాలో ప్రయాణికులను తీసుకెళ్లడానికి బయటకు వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. మరసటి రోజు తెల్లవారుజామున ఇంట్లో అతడి మృతదేహం లభ్యమైంది. సోనూ తండ్రి తన కోడలు, ప్రియుడుతో సహా మరో ఇద్దరిపై హత్య ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం పోలీసులు స్మితాను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు హరి ఓం పరారీలో ఉన్నాడు.

Exit mobile version