Site icon NTV Telugu

Lover Kills Family: ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్ల హత్య..

Crime

Crime

Lover Kills Family: బీహార్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తాను ప్రేమించిన బాలిక కుటుంబాన్ని హతమార్చాడు. ఈ ఘటన సరన్ జిల్లాలోని ధనాదిహ్ గ్రామంలో జరిగింది. నిందితుడు ఇద్దరు మైనర్ బాలికలతో పాటు వారి తండ్రిని కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ దాడిలో బాలికల తల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Read Also: UP BJP: యూపీ బీజేపీలో లుకలుకలు.. ఉప ఎన్నికల ముందు యోగి vs కేశవ్ మౌర్య?

రసూల్‌పూర్‌కి చెందిన ఇద్దరు నిందితులు సుధాన్షు కుమాల్ అలియాస్ రోషన్, అంకిత్ కుమార్ మంగళవారం రాత్రి తారకేశ్వర్ సింగ్ అలియాస్ జబర్ సింగ్, అతని ఇద్దరు మైనర్ కుమార్తెలపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు సరన్ పోలీసులు తెలిపారు. తారకేశ్వర్ సింగ్ భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, ఇతర సమాచారాన్ని సేకరించి నిందితులు ఇద్దర్ని పోలీసులు నేరం జరిగిన గంటలోపే అరెస్ట్ చేశారు. సుధాన్షు కుమార్‌కి ఒక అమ్మాయికి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమే ముగ్గురి హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో హత్యకు నిందితులు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చాప్రా సదర్ ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version