Site icon NTV Telugu

Rape Case: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం.. విద్యుత్ షాక్ ఇచ్చి హత్య.. సహకరించిన తల్లి..!

Rape

Rape

Rape Case: బీహార్‌లోని ఆత్మగోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు 12 గంటల్లోనే కేసును ఛేదించి, అదే గ్రామానికి చెందిన నిందితుడైన ఓ యువకుడు, అతని తల్లిని అరెస్టు చేశారు. ఆ బాలిక మేకలను మేపడానికి వెళ్ళినప్పుడు.. యువకుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. నిందితుడి తల్లితో కలిసి ఆ మృతదేహాన్ని పొలంలో పడేశారు.

READ MORE: Niharika NM: యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌ స్క్రీన్‌ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్‌ స్టోరీ

పోలీసుల కథనం ప్రకారం.. కర్జన్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఒక బాలిక మృతదేహం గుర్తించారు. సమాచారం అందిన వెంటనే.. ఆత్మగోలా, భక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ల అధికారులు.. ఫ్లడ్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు గ్రామంలోని అనుమానిత 17 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆ యువకుడు తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఆ ఏడేళ్ల బాలిక ప్రతిరోజూ మేకలను మేపడానికి పొలానికి వచ్చేదని నిందితుడు పేర్కొన్నాడు. బుధవారం కూడా ఆమె మేకలను మేపడానికి పొలానికి వచ్చింది. ఆ బాలికను నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె చేతులకు విద్యుత్తు తీగ కట్టి, విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. అనంతరం జరిగినదంతా తన తల్లికి చెప్పాడు. ఆమెతో కలిసి ఆ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి వరి పొలంలో పడేశాడు. ఈ బ్లైండ్ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే విజయవంతంగా ఛేదించారని రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.

READ MORE: NTR Vaidya Seva: ఎన్టీఆర్‌ వైద్య సేవ బంద్.. నిలిచిపోయిన ఓపీ, ఎమర్జెన్సీ సేవలు..

Exit mobile version