Site icon NTV Telugu

Kuppam: కుప్పంలో మహిళను కరెంట్ పోల్‌కు కట్టేసిన కేసులో ట్విస్ట్..! సొంత కొడుకే..

Kuppam

Kuppam

Kuppam: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినథ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలను కరెంట్ స్థంభానికి కట్టేసిన వీడియోపై ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఆ మధ్యే.. ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన సంచలనం సృష్టించడం.. దానిపై తీవ్ర రాజకీయ దుమారం రేగడం.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి.. బాధిత మహిళకు అండగా నిలిచారు.. ఇప్పుడు, శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో ఓ మహిళను కరెంట్‌ పోల్‌కు కట్టేసిన వీడియో వైరల్‌ అయ్యింది.. దీనిపై స్పందించిన పోలీసులు.. క్లారిటీ ఇచ్చారు..

Read Also: Cancer Research: సిగరెట్స్, మందు తాగకపోయినా క్యాన్సర్.. వీళ్లకు కచ్చితంగా రావొచ్చు..!

శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో సొంత కొడుకే తల్లిని కరెంట్ స్థంభానికి కట్టి డ్రామా ఆడినట్లు నిర్ధారించారు పోలీసులు.. బంధువులతో ఉన్న ఆస్థి తగాదాల విషయంలో తప్పుడు ప్రచారం కోసం తల్లిని డ్రిప్ పైపులతో కరెంట్‌ పోల్‌కు కట్టేశాడు కుమారుడు.. ఇక, తమ బంధువులు తన తల్లిని స్థంభానికి కట్టేశారని ఫేస్ బుక్‌లో ఓ వీడియో పెట్టాడు కుమారుడు సురేష్. ఇప్పటికే ఓ ఘటన జరడగం.. అది కాస్త వివాదం కావడం.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ఘటన కూడా వెలుగు చూడడంతో.. ఆ వీడియోను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.. చివరకు, సానుభూతి కోసం కొడుకు సురేష్‌ డ్రామా ఆడాడని తేల్చారు.. సురేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. తల్లిని స్థంభానికి కట్టేసి డ్రామా సృష్టించిన సురేష్ ను అరెస్ట్ చేశారు..

Exit mobile version