Bhopal: భోపాల్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి.. స్నేహితుడితో మందు పార్టీ.. చివరికిలా..!
- భోపాల్‌లో దారుణం
- ప్రియురాలిని చంపిన ప్రియుడు
- స్నేహితుడితో మందు పార్టీ చేసుకుంటుండగా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న ప్రియురాలిని చంపి బెంగళూరు మున్సిపాలిటీ చెత్త ట్రక్కులో పడేశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన మరువక ముందే భోపాల్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Megha Start: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో చిరు సందడి.. పిక్స్ వైరల్ !
Also Read
రితికా సేన్(29), సచిన్ రాజ్‌పుత్ (32) ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. భోపాల్‌లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 27న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో సచిన్ రాజ్‌పుత్.. రితికా గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, తాడుతో కట్టి ఇంట్లోనే వదిలేశాడు. అనంతరం సచిన్.. ఒక స్నేహితుడితో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్.. నిజాన్ని కక్కేశాడు. రితికాను చంపేసి ఇంట్లో ఉంచినట్లు చెప్పాడు. కానీ స్నేహితుడు నమ్మలేదు. మరుసటి రోజు స్నేహితుడు.. సచిన్ ఇంటిని పరిశీలించగా రితికా మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.
ఇది కూడా చదవండి: Liquor : ఏ బ్రాండ్ డేంజర్.. ఏది తాగితే బెటర్..?
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కుళ్లిపోయిన డెడ్‌బాడీనికి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం నిందితుడు సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంట్లోంచి కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!