Site icon NTV Telugu

MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్‌మెయిల్..

Crime

Crime

MP News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్(11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై నాలుగు కార్లలో అత్యాచారం, చేసి ఆమె వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇదే కాకుండా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

షాపురా ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక స్కూల్‌లో చదువుతున్న బాలికకు ఒక స్నేహితుడి ద్వారా ఆసఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం పెరిగిన తర్వాత, అలీఖాన్ ఆమెను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడాడు. అక్కడే కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, ఈ అత్యాచారం ప్లాన్ ప్రకారం చేసినట్లు తేలింది. జిమ్ యజమాని అయిన అలీఖాన్ సోదరుడు మాజ్ ఖాన్ కారులోనే ఉండీ, ఆమె అసభ్యకరమైన వీడియోలను తీసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.

Read Also: Rajkumar Hirani : AIతో సినిమా ప్లాన్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్.. త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం..

ఇద్దరు నిందితులు రూ. 1 లక్ష ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఏదో విధంగా రూ. 4000 ఇచ్చారు. అయినప్పటికీ ఆమెపై లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్ ఆగలేదు. నాలుగు కార్లలో పలు సందర్భాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులతో పాటు రెండు సెడాన్, ఒక మహీంద్రా థార్ కారుతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈకేసులో బాధితురాలు నిందితులిద్దరిని బ్లాక్ చేసిన తర్వాత, ఆసఫ్ ఆమె వీడియోలను తన స్నేహితులకు పంపి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు తేలింది. చివరకు ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు విసయం చెప్పడంతో, హిందూ సంస్థల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. నిందితులు మరెవరైనా మహిళల్ని టార్గెట్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భోపాల్ కోర్టులో ఆసఫ్‌ను హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు అతడిపై దాడి చేశారు.

Exit mobile version