Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివరాలు సేకరించారు.. అయితే, మతిస్థిమితం కోల్పోయిన శ్రీనివాస్.. తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసి నేరుగా పోలీసులకే సమాచారం ఇచ్చి లొంగిపోయాడని చెబుతున్నారు..
Read Also: Revolver Rita :ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన కీర్తీ సురేష్ మూవీ!
భీమవరం సుంకర పద్దయ్య వీధిలో వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను కత్తితో నరికి హత్య చేశాడు. అంతేకాకుండా తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసానని ఇప్పుడు తాను వచ్చి లొంగిపోవాలని నేరుగా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డీఎస్పీ జై సూర్య, వన్‌టౌన్ సీఐ నాగరాజులు పరిశీలించారు. ఈ ఘటనపై ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ తల్లిని, తమ్ముడిని హత్య చేశానని పోలీసులకి నేరుగా సమాచారం ఇవ్వడం జరిగిందని, అయితే కరోనా సమయంలో శ్రీనివాస్ తండ్రి మరణించడంతో అప్పటినుండి శ్రీనివాస్ మతిస్థిమితం లేకుండా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ ఈ ఘాతాకానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం శ్రీనివాస్ కు మెంటల్ కండిషన్ బాగోలేదని, ఆసుపత్రిలో చెక్ చేస్తున్నామని అన్నారు. శ్రీనివాస్ సిస్టర్ బెంగళూరు నుండి వస్తున్నారని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ..
