Site icon NTV Telugu

Betting Seva : మీ సేవా సెంటర్ కాదు.. మై బెట్టింగ్ సెంటర్..!

Betting

Betting

Betting Seva : నిర్మల్ జిల్లా పోలీసులు భైంసా ప్రాంతంలో జరుగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై గట్టి దాడి చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా భైంసాను అడ్డాగా చేసుకుని ఈ అక్రమ కార్యకలాపాలను నడిపిస్తున్న సయ్యద్ ఆజమ్‌ను గురువారం రాత్రి ఓవైసీ నగర్‌లోని ఓ ఆలయం సమీపంలో మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం, ఆజమ్ మీ సేవా సెంటర్ ముసుగులో Allpannel.com అనే యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బాధితుల నుండి బ్యాంక్ ఖాతాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తీసుకుని వారికి ప్రతి నెలా కొంత డబ్బు ఇస్తానని నమ్మబలికి ట్రాన్సాక్షన్లు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బులను అవాలా రూపంలో ఇతర ఖాతాలకు మళ్లించడంతో పాటు నకిలీ ఐటీ రిటర్న్స్, ఫేక్ ఇన్కమ్ సర్టిఫికెట్లు తయారు చేసి ఈ దందాను కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు.

SSMB 29 : త్రిబుల్ ఆర్ ను మించిన ఇంటర్వెల్ సీన్.. జక్కన్న భారీ స్కెచ్..

దాడిలో పోలీసులు నిందితుడి వద్ద నుండి 16.3 లక్షల రూపాయల నగదు, సుమారు 385 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు బంగారు బిస్కెట్లు, 21 ఆస్తి పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఎనిమిది ఏటీఎం కార్డులు, అలాగే బాధితుల పాన్–ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి ముఠాలకు లోబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Amit Shah: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్‌షా తీవ్ర ఆరోపణలు..

Exit mobile version