Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. ఇదిలా ఉంటే, బెంగళూర్‌లో 32 ఏళ్ల మహిళ తన భర్త మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టి చంపింది. సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తు్న్న బాధితుడు భాస్కర్(42)కు అతడి భార్య శృతికి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత శ్రుతి రాగి ముద్దను తయారు చేసే వంట కర్రతో కొట్టి చంపింది. ఈ ఘటన నగరంలోని సుద్దగుంటే పాల్య ప్రాంతంలో జరిగింది. భాస్కర్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి 12 సంవత్సరాల క్రితం శ్రుతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Also: AIADMK: విజయ్ కోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. పొత్తుపై అన్నాడీఎంకే..
ఇంట్లో పనిమనిషితో అనుమానాస్పద సంబంధంపై భర్తతో, శ్రుతికి వాగ్వాదం ఏర్పడింది. ఇటీవల పని మానేసిన భాస్కర్, ఇళ్ల అద్దెల ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదిస్తున్నాడు. అయితే, ఈ డబ్బులను అతనితో సంబంధం ఉన్న మహిళకు ఇస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయితే, తన భర్త బాత్రూంలో జారిపడి చనిపోయినట్లు ముందుగా శ్రుతి చెప్పింది. పోలీసులు దీనిని మొదట అసహజ మరణం నివేదిక(యూడీఆర్) నమోదు చేసి, భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. పోస్టుమార్టంలో మృతుడి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో శ్రుతి నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం, నిందితురాలిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తరుపరి దర్యాప్తు జర
