NTV Telugu Site icon

Bengaluru: పార్టీ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థిని.. లిఫ్ట్ ఇచ్చి రేప్ చేసిన బైకర్..

Crime

Crime

Bengaluru: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం హత్య ఘటన మరవకముందే దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ విద్యార్థినిపై రేప్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని బైకర్ అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

అడిషనల్ పోలీస్ కమిషనర్(ఈస్ట్ జోన్) రామన్ గుప్తా ప్రకారం.. బెంగళూర్‌లో ఓ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న యువతి, కోరమంగళలో గెట్ టూగెదర్ పార్టీ తర్వతా హెబ్బగోడి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ సమయంలో ఆమె ఓ అపరిచిత వ్యక్తి నుంచి లిఫ్ట్ కోరింది. ఆమెకు సదరు బైకర్ లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు.

ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఆమె కోరమంగళలో జరిగిన గెట్ టూగెదర్ పార్టీకి వెళ్లినట్లు కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఒకే అనుమానితుడు ఉన్నాడని, ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని రేపిస్టుగా అనుమానిస్తున్నారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలు, ఆమె బంధువులతో మాట్లాడారు. ఐదు బృందాలతో నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. త్వరలోనే నేరస్తుడిని పట్టుకుంటామని చెప్పారు.

Show comments