Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- ఖాళీ స్థలం క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం..
- భర్తనే హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు..
- బట్టల ట్యాగ్ ఆధారంగా కేసును ఛేదించిన బెంగళూర్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ మున్సిపల్ సంస్థ ఖాళీ ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తు్న క్రమంలో, ఒక స్థలంలో కూలీలకు మహిళకు చెందిన కుళ్లిపోయిన మృతదేహం లభించింది. చివరకు ఈ డెడ్‌బాడీ దారుణ హత్యకు గురైన మహిళదని పోలీసుల దర్యాప్తులో తేలింది. భర్తనే ఆ మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత భార్య మృతదేహాన్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.
28 ఏళ్ల మహిళ హత్యను సంపిగెహళ్లి పోలీసులు ఛేదించారు. బీహార్‌కు చెందిన సాగర్ చంద్ర రావత్(32), తన భార్య అనసూయ బెహరా(28)ని హత్య చేసిన ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుని, బతుకుదెరువు కోసం బెంగళూర్ వచ్చారు. రావత్ ఒక హోటల్లో పనిచేస్తుండగా, అనసూయ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరికి ఆర్థిక విషయాలో తరుచూ గొడవలు జరిగేవని, ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న రావత్ అనసూయపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. హత్య తర్వాత మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని, ఆ తర్వాత ఒక దుప్పటిలో మృతదేహాన్ని చుట్టి, సంపిగెహల్లీ ప్రాంతంలోని ఒక ఖాళీ ప్రదేశంలో పారేశాడు.
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
బట్టల ట్యాగ్‌లో హత్యను ఛేదించిన పోలీసులు..
మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో మహిళ గుర్తింపును కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే మృతదేహంపై ఉన్న బట్టల ట్యాగ్ ఆధారంగా, ఒక మాల్లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత నిందితుడు, మృతురాలని పోలీసులు గుర్తించగలిగారు. హత్య తర్వాత కూడా రావత్ హోటల్లో తన విధులకు హాజరవుతున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?