NTV Telugu Site icon

Bengaluru: సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు.. కంపెనీ ఏం చేసిందంటే..!

Bengalurumen

Bengalurumen

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!

నికిత్ శెట్టి అనే యువకుడు బెంగళూరులోని ఎటియోస్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాడు. ఇతడు సోషల్ మీడియాలో ఒక వివాహిత దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను మహిళ భర్త ప్రభుత్వాధికారులకు షేర్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యకు పంపిన బెదిరింపు సందేశం స్క్రీన్‌షాట్‌ కంపెనీ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు దిగింది. ఇది ఆమోదయోగ్యం కాదని.. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..

‘‘ఇది చాలా తీవ్రమైనది. @DgpKarnataka, @CMofKarnataka, @DKShivakumar. బట్టల ఎంపికపై నా భార్య ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఎలాంటి సంఘటన జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోండి’’ అని షాబాజ్ అన్సార్ ట్వీట్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ‘‘నా భార్యను యాసిడ్ దాడితో బెదిరిస్తున్న వ్యక్తి ఎటియోస్ డిజిటల్ సర్వీస్‌లో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను అనుకోను’’ అని షాబాజ్ అన్సార్ పేర్కొన్నాడు.

ఈ సంఘటనపై ఎటియోస్ సర్వీసెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. నికిత్ రెడ్డి చర్య ఆమోదయోగ్యం కాదని.. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. మేము చాలా బాధపడ్డాము. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ఎటియోస్ సర్వీసెస్‌లో మేము పాటించే ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉంది.’’ అని కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై నికిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Nayab Singh Saini: అక్టోబర్ 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..